ఆయనలా నియంత చర్యలు చేయడం లేదు : జో బైడెన్

ఆయనలా నియంత చర్యలు చేయడం లేదు : జో బైడెన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెటకారం ప్రదర్శించారు. తనను విమర్శించినా పర్వాలేదని అంటూనే తానేం పుతిన్‌లా నియంతను కాదంటూ వ్యాఖ్యాలు చేశారు. ప్రముఖ కమెడియన్‌ ట్రెవోర్‌ నోవాప్‌ వైట్‌హౌస్‌లో జరిగిన ఆన్యువల్‌ వైట్‌హౌజ్‌ కరెస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ డిన్నర్‌కు హాజరయ్యారు. ఆఫ్రికా తరపున ఈ ఘటన దక్కించుకున్న తొలి వ్యక్తి కూడా ట్రెవోర్‌ నోప్‌ా. అయితే ట్రెవోర్‌ను జో బైడెన్‌ స్వయంగా వేదిక మీదకు ఆహ్వానించాడు. లేడీస్‌ అండ్‌ జెంటిల్మెన్‌ ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు ట్రెవోర్‌. ఇక నేను నా సీట్‌లో కూర్చుంటా ట్రెవోర్‌ మీకొక శుభవార్త. మీరు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిని నిరభ్యరంతంగా విమర్శించొచ్చు.  మాస్కోలో లాగా మిమ్మల్నేం అరెస్ట్‌ చేయబోం. మీరు స్వేచ్ఛగా చెలరేగిపోవచ్చు  అంటూ బైడెన్‌ చమత్కరించాడు.

 

Tags :