అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. ఆయనకు జరిపిన కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఆయనకు చాలా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన పాక్స్‌లోవిడ్‌ మాత్రలు వాడుతున్నారని, సీడీసీ మార్గదర్శకాలను అనుగుణంగా ఆయన శ్వేతసౌధంలో ఐసొలేషన్‌లో ఉండి విధులను నిర్వర్తిస్తారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయనకు జ్వరం లేదని, ముక్కు కారడం, కొంచెం ఆలసట, పొడి దగ్గు లక్షణాలు ఉన్నట్లు వైట్‌హౌస్‌ కరోనా వైరస్‌ కోర్డినేటర్‌ డాక్టర్‌ ఆశిష్‌ ఝును తెలిపారు. 79 ఏళ్ల బైడెన్‌ పూర్తిస్థాయిలో టీకాలు పొందారని, రెండుసార్లు బూస్టర్‌ డోసు కూడా తీసకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు.

 

Tags :