బైడెన్ కు మళ్లీ పాజిటివ్

బైడెన్ కు మళ్లీ పాజిటివ్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మళ్లీ కరోనా బారినపడ్డారు. కరోనా నుంచి బైడెన్‌ పూర్తిగా కోలుకున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడురోజులకు మళ్లీ ఆయనకు పాజిటివ్‌గా తేలిందని వైద్యులు తెలిపారు. దీంతో బైడెన్‌ మరోసారి ఐసోలేషన్‌కు వెళ్ళారు. ప్రస్తుతం ఆయనకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్‌ వైద్యలు కెవిన్‌ ఒ కానర్‌ తెలిపారు. బైడెన్‌కు నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో నెగెటివ్‌ తేలిన తర్వాత మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారన అయింది. మళ్లీ ఐసోలేషన్‌ నిబంధనలు పాటిస్తున్నారు. అత్యవసరంగా చికిత్స అందించాల్సిన లక్షణాలేమీ కనిపించలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని డాక్టర్‌ పేర్కొన్నారు.

 

Tags :