MKOne TeluguTimes-Youtube-Channel

ప్రధాని నరేంద్ర మోదీకి జో బైడెన్ ఆతిథ్యం !

ప్రధాని నరేంద్ర మోదీకి జో బైడెన్ ఆతిథ్యం !

ఈ  వేసవిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కి అమెరికా తరపున విందు ఏర్పాటు చేసేందుకు ఆ  దేశాధ్యక్షుడు జో బైడెన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం జూన్‌లో నిర్వహించాలని శ్వేతసౌధం భావిస్తోంది. ఈ అంశంపై మాట్లాడేందుకు అమెరికా జాతీయ భద్రతా సమితి నిరాకరించింది. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్‌ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్‌`అమెరికా మధ్య బలపడుతున్న బంధానికి ఈ విందు ఓ కీలక సంకేతంగా నిలవనుంది. ఇప్పటికే గత నెలలో బైడెన్‌ సర్కార్‌ భారత్‌లో ఇనీషియేటీవ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీని కింద కంప్యూటింగ్‌, జెట్‌ ఇంజిన్ల సంయుక్త అభివృద్ధి వంటి  ప్రాజెక్టులు  ఉన్నాయి. భారత్‌పై రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా తీసుకొన్న కీలక నిర్ణయంగా దీనిని భావిస్తున్నారు.  ఇటీవల కాలంలో బైడెన్‌ ప్రభుత్వం విదేశీ అతిథులకు ఇచ్చే మూడో విందుగా ఇది నిలిచే అవకాశం ఉంది.

 

 

Tags :