ఈ చర్యలు అంతర్జాతీయ సమాజానికి ముప్పు : అమెరికా

ఈ చర్యలు అంతర్జాతీయ సమాజానికి ముప్పు : అమెరికా

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చేష్టలపై అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది. వారం వ్యవధిలో రెండోసారి బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలను నిర్వహించడంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. దీంతో తీవ్ర ఆహార సంక్షోభం నేపథ్యంలో మిస్సైల్‌ పరీక్షలపై కిమ్‌ వెనక్కి తగ్గాడన్న అంచనాలు మళ్లీ తప్పాయి. కేవలం వారం వ్యవధిలో రెండుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించాడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. స్వయంగా దగ్గరుండి మరీ పరీక్షించాడు. ఈ చర్యలు అంతర్జాతీయ సమాజానికి ముప్పుగా పరిణమించబోతున్నాయని పేర్కొంది. అదే సయమంలో దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల మధ్య రక్షణ కోసం తమ నిబద్థతను చాటుకుంటామని అమెరికా పునరుద్టాటించింది.  ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమితి భద్రత మండలి నియమ, నిబంధనలు ఉల్లంఘించిదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

Tags :