ఉక్రెయిన్ కు అమెరికా మరో 80 కోట్ల సాయం

ఉక్రెయిన్‌కు తాజాగా సైనిక సాయాన్ని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా కొత్తగా దాడులు జరుపుతుందనే అంచనాల మధ్య అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు మరో 80 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని ప్రకటించారు. యుద్ధ శకటాలు, తీర ప్రాంత రక్షణలో నౌకల్లో నుండి ప్రయోగించగల డ్రోన్‌లు, రసాయన, జీవాయుధ, అణు, రేడియాలజీ దాడుల్లో సైనికులకు రక్షణగా ఉపయోగించే గేర్, ఇతర పరికరాలను ఈ సైనిక సాయం కింద అందచేయనున్నారు. అత్యంత సమర్థవంతమైన ఆయుధ వ్యవస్థలు, రష్యా కొత్తగా ఆరంభించే విస్తృత దాడులకు అవసరమైన కొత్త సామర్ధ్యాలు అన్నీ ఇందులో వుంటాయని బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్ విఫలమయ్యారని, ఈ తరుణంలో మనం విశ్రాంతిగా వుండలేమని అన్నారు.
Tags :