భారత్-అమెరికా సంబంధాలు తమకు చాలా ముఖ్యం

వాణిజ్య సహకారం సహా అనేక అంశాల్లో అమెరికా ఎంచుకునే ఓ కీలక భాగస్వామి భారత్ అని అధ్యక్షుడు జో బైడెన్ పాలనా యంత్రాంగం లోని ఓ అధికారి అన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చే వారం అమెరికాలో కీలక పర్యటన చేయనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ డోభాల్ పర్యటనపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో భద్రతా సహకారాన్ని పెంపొందించుకోవడం కూడా ఉభయ దేశాల సంబంధాల్లో భాగమని పేర్కొన్నారు. వీటిలో సాంకేతిక సహకారం కూడా ఉందని తెలిపారు. భారత్` అమెరికా సంబంధాలు తమకు చాలా ముఖ్యమైనవని తెలిపారు.
Tags :