ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య.. ఉద్రిక్తతలకు అమెరికానే

ఉత్తర, దక్షిణ  కొరియాల మధ్య.. ఉద్రిక్తతలకు అమెరికానే

తాము అజేయమైన సైన్యాన్ని నిర్మిస్తామని ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా అనుసరిస్తున్న ఉద్రిక్త పాలసీల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఉత్తర కొరియా అభివృద్ధి కేవలం ఆత్మరక్షణ కోసమేనని తెలిపారు. అక్కడ నిర్వహించిన ఓ రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా ఇటీవల సూపర్‌ సోనిక్‌, యాంటి ఎయిర్‌క్రాప్ట్‌ క్షిపణులను పరీక్షించింది. సెల్ఫ్‌ డిఫెన్స్‌ 2021 ఎగ్గిబిషన్‌ను ప్యాంగ్‌యాంగ్‌లో ప్రారంభించారు. దీనిలో ట్యాంకులు, క్షిపణులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కిమ్‌ ప్రసగించారు. దక్షిణ కొరియా సైనిక పరంగా బలపడటంపై మాట్లాడారు. ఉత్తర కొరియా తన పొరుగుదేశంతో యుద్దం చేయాలనుకోవడం లేదని తెలిపారు. మేము యుద్దం ప్రారంభించడం గురించి కాని, యుద్దాన్ని నిరోధించడం, దేశ సౌర్వభౌమత్వం రక్షణ కోసం ప్రత్యర్థుల్లో భయాన్ని పెంచడంపై మాట్లాడుతుతామని కిమ్‌ అన్నారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మద్య ఉద్రికత్తతలు పెరగడానికి అమెరికానే కారణమని నిందించారు.

 

Tags :