జనవరి 10న అమెరికా, రష్యా చర్చలు

జనవరి 10న అమెరికా, రష్యా  చర్చలు

అమెరికా, రష్యా చర్చలు జనవరి ప్రారంభంలో జరగనున్నాయి. యురోపియన్‌ భద్రత, ఉక్రెయిన్‌ ఘర్షణలపై ఈ చర్చలు దృష్టి కేంద్రీకరించనున్నాయి. జనవరి 10న ఈ చర్చలు జరుగుతాయని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపారు. రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గి రిజబకొవ్‌ ఈ విషయాన్ని ధవృవీకరించారు. జెనీవాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా నేత వ్లాదిమిర్‌ పుతిన్‌లు సమావేశమవుతారని తెలిపారు. రష్యాతో చర్చలు జరిపేందుకు  అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోందని అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించారు.  చర్చల్లో ఇరుపక్షాలు వారి ఆందోళనలను, వాదనలను ప్రస్తావిస్తాయని అన్నారు.  ఆ  తర్వాత జనవరి 12వ తేదీన రష్యా నాటో ప్రతినిధులు సమావేశమవుతారని భావిస్తున్నారు.

 

Tags :