చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షలు

చైనా సంస్థలపై  అగ్రరాజ్యం ఆంక్షలు

యుగుర్‌ ముస్లింలపై చైనా మావన హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు అమెరికా ఆరోపించింది. అందువల్ల ఆ దేశ బయోటెక్‌, నిఘా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలపై తాజాగా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. తాజా  చర్యతో ఈ సంస్థలకు లైసెన్సు లేకుండా ఎలాంటి ఉపకరణాలను అగ్రరాజ్య కంపెనీలు విక్రయించకూడదు. చైనా సైన్యానికి మద్దతుగా బయోటెక్నాలజీని ఉపయోగిస్తున్న చైనా అకాడమీ ఆఫ్‌ మిలటరీ మెడికల్‌, సైన్సెస్‌ దానికి సంబంధించిన 11 పరిశోధన సంస్థలను అమెరికా వాణిజ్య శాఖ లక్ష్యంగా చేసుకుంటోంది. బయోటెక్‌, వైద్య ఆవిష్కరణలను ప్రజలపై నియంత్రణ, మతపరమైన మైనార్టీల అణచివేతకు చైనా ఉపయోగిస్తోంది అని అమెరికా వాణిజ్య శాఖ సెక్రటరీ గినా రైమాండో తెలిపారు. ఒక పథకం ప్రకారం యుగుర్లను అణచివేయడం కోసం చైనా ప్రయత్నిస్తోందని అమెరికా అధికారులు ఆరోపించారు. అక్కడ బయోమెట్రిక్‌ ముఖ గుర్తింపు వ్యవస్థతో కూడిన అధునాతన నిఘా సాధనాలను డ్రాగన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 12`65 ఏళ్ల మధ్య ఉన్నవారి డీఎన్‌ఏ నమూనానలు సేకరించిందని తెలిపారు.

 

Tags :