షట్‌డౌన్‌ను నివారించేందుకు చివరి నిముషంలో బిల్లు

షట్‌డౌన్‌ను నివారించేందుకు చివరి నిముషంలో బిల్లు

ప్రభుత్వ షట్‌డౌన్‌ను నివారించేందుకు చివరి నిమిషయంలో ఫండింగ్‌ బిల్లుకు అమెరికన్‌ సెనేట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది. నిర్ధిష్ట గడువులోగా బిల్లు ఆమోదం పొందని పక్షంలో ఫెడరల్‌ ఉద్యోగుల జీతాలను చెల్లింపు నిలిచిపోవడంతో బాటు ప్రజా సేవలు, సామాజిక భద్రత ఆగిపోతాయని ప్రభుత్వం బెదిరించింది. దీంతో డిసెంబర్‌ 3 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు సెనేట్‌ 65`35 మెజారీటీతో బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం కుప్పకూలకుండా వుండేందుకు గానూ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అత్యవసరంగా ఒక అంగీకారానికి వచ్చారు. పెరుగుతున్న రుణ పరిమితిపై ఈ వారం ప్రారంభంలో అమెరికన్‌ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. చివరి నిమిషంలో బిల్లు ఆమోదాన్ని రిపబ్లికన్ల విషయంగా సెనేట్‌ మైనారిటీ నేత మిచ్‌ మెకానెల్‌ తెలిపారు.

 

Tags :