మరో ప్రతిష్ఠాత్మక పదవిలో భారతీయ అమెరికన్

సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (ఎస్‌డీఎవై) జడ్జిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్ నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. మెజారిటీ సభ్యులు ఈ నియామకానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఈ పదవిని చేపట్టబోతున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా సుబ్రమణియన్ నిలవనున్నారు. కష్టపడే స్వభావమున్న సుబ్రమణియన్ తన కెరీర్‌లో ప్రజల కోసమే పోరాడారని సెనేట్ నాయకుడు చక్ షూమర్స్ వ్యాఖ్యానించారు. అమెరికా కలలకు ఆయన ప్రతిరూపమని కొనియాడారు. కేస్ వెస్ట్రన్ రిజర్వు విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్సు, ఆంగ్లంలో పట్టా తీసుకున్న సుబ్రమణియన్ ఆ తర్వాత కొలంబియా లా స్కూల్ నుంచి డిగ్రీ పొందారు.
Tags :