మరో భారతీయ అమెరికన్ కు కీలక పదవి

అమెరికాలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. అమెరికా విదేశాంగ శాఖలో శక్తిమంతమైన డిప్యూటీ సెక్రటరీ పదవికి ప్రముఖ న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్ వర్మ (54) నామినేషన్‌ను సెనెట్ ఆమోదించింది. ఓటింగ్‌లో 67-26 మెజార్టీతో ఆమోదం తెలిపింది. ఈ హోదాను విదేశాంగ శాఖ సీఈవోగా పరిగణిస్తారు. రిచర్డ్ వర్మ్ 2015`2017 మధ్య భారత్‌లో అమెరికా రాయబారిగా సేవలు అందించారు. ప్రస్తుతం మాస్టర్‌కార్డ్ సంస్థకు ప్రధాన న్యాయ వ్యవహారాల అధికారిగా, ప్రపంచ ప్రజా విధానాల విభాగ అధిపతిగా ఉన్నారు. ఒబామా హయాంలో విదేశాంగ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ ( చట్ట వ్యవహారాలు) గా వ్యవహరించారు.
అంతకు ముందు సెనెటర్ హారీ రెడ్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా సేవలందించారు. ఆసియా గ్రూప్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అమెరికా వైమానిక దళంలో జడ్జి అడ్వొకేట్‌గా పని చేశారు. అధ్యక్షుడి నిఘా సలహా బోర్డులో సేవలందించారు. సామూహిక విధ్వంసం ఆయుధాలు, ఉగ్రవాద నిరోధక కమిషన్‌లో సభ్యుడిగా కొనసాగారు. ఫోర్డ్ ఫౌండేషన్ ట్రస్టీగానూ, మరికొన్ని సంస్థల బోర్డుల్లో సభ్యుడిగానూ ఉన్నారు. అమెరికాకు వలస వచ్చిన ఓ భారతీయ కుటుంబంలో 1968లో జన్మించిన రిచర్డ్ వర్మ పెన్సిల్వేనియాలో పెరిగారు. జార్జిటౌన్ యూనివర్సిటీ లా సెంటర్‌లో న్యాయవాద విద్యలో పీజీ, జార్జిటౌన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. తన సేవలకుగానూ విదేశాంగ శాఖ, విదేశీ వ్యవహరాల మండలి, వైమానిక దళం నుంచి పురస్కారాలు అందుకున్నారు.