చరిత్రాత్మక బిల్లుకు అమెరికా సెనేట్ గ్రీన్ సిగ్నల్

చరిత్రాత్మక బిల్లుకు అమెరికా సెనేట్ గ్రీన్ సిగ్నల్

చరిత్రాత్మక బిల్లుకు అమెరికా సెనేట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. స్వలింగ సంపర్కుల వివాహ బిల్లును సెనేట్‌ ఆమోదించింది. స్వలింగ, వర్ణాంతర వివాహాలకు చట్టబద్ధత కల్పించే బిల్లుని సభలో ప్రవేశ పెట్టగా 61`36 తేడాతో ఆమోదం లభించింది. ఇక తుది ఆమోదం కోసం దీన్ని ప్రతినిధుల సభకు పంపిస్తారు. అక్కడ అమోదం లభిస్తే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బిల్లుపై సంతకం చేస్తారు. అప్పుడది చట్టంగా మారుతుంది. ఈ బిల్లు చట్టంగా మారితే స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత లభిస్తుంది. వచ్చే ఏడాది జనవరి చివరినాటికల్లా ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

 

 

Tags :