ఆ రెండు దేశాల నాటో సభ్యత్వానికి.. అమెరికా మద్దతు

ఆ రెండు దేశాల నాటో సభ్యత్వానికి.. అమెరికా మద్దతు

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి నేపథ్యంలో నాటో కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాలకు అమెరికా తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ రెండు దేశాల నాటో సభ్యత్వానికి ఆ దేశ సెనేట్‌ 95-1తో ఆమోద ముద్ర వేసింది. సభ్యులు భారీస్థాయిలో ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. 30 దేశాల కూటమిలో స్వీడన్‌, ఫిన్లాండ్‌ చేరాలంటే సభ్యదేశాలన్నీ అంగీకరించాలి.

 

Tags :