ఒపెక్ దేశాల కట్టడికి భారత్-అమెరికా వ్యూహం

ఒపెక్ దేశాల కట్టడికి భారత్-అమెరికా వ్యూహం

పెట్రోలియం ఎగుమతి దేశాల అధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో భారత్‌ చమురు నిల్వల నుంచి దాదాపు 5 మిలియన్‌ బ్యారెళ్ల చమురును అమెరికా, ఇతర దేశాలతో సమన్వయంతో త్వరలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గడానికి ఈ చర్య దోహద పడుతుందని భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం  ప్రకారం.. పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్‌) వైఖరిని ఎదిరించేందుకు భారత్‌, అమెరికాలు ఇతర దేశాల సమన్వయంతో పనిచేస్తున్నాయి. భారతదేశం తన వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి సుమారు 5 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వచ్చేవారంలో విడుదల చేయడం వల్ల ఒపెక్‌ దేశాలకు ఓ సందేశాన్ని పంపినట్లవుతుంది. పెట్రోలియం ఉత్పత్తులను భారీగా ఉపయోగించుకునే ప్రధాన దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలు పంపుతుంది.

ఒపెక్‌ దేశాలు పెట్రోలియం ఉత్పత్తిని పెంచవలసిన అవసరం లేదని, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పేర్కొంది. ప్రధాన వినియోగదారులైన దేశాలు ఒత్తిడి తెస్తున్నప్పటికీ అటువంటి ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియాల సమన్వయంతో  ఓ ప్రకటన విడుదల చసే అవకాశం ఉందంటున్నారు. చైనా కూడా తన వద్ద ఉన్న నిల్వల నుంచి కొంత చమురును విడుదల చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.

 

Tags :