అఫ్గాన్ పౌరులకు అమెరికా భారీ సాయం

అఫ్గాన్ పౌరులకు అమెరికా భారీ సాయం

తాలిబన్ల పాలనలో దుర్బర జీవితాన్ని గడుపుతున్న అఫ్గాన్లను ఆదుకోవడానికి అమెరికా భారీ ఆర్థికసాయాన్ని ప్రకటించింది. మానవతా ధృక్పథంతో దాదాపు రూ.1,080 కోట్లను అందజేయనున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్‌ తెలిపారు. ఈ నిధులను అఫ్గాన్‌ ప్రభుత్వానికి ఇవ్వమని, సేవా కార్యక్రమాలు నిర్వహించే ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలకు ఇస్తామని తెలిపారు. తద్వారా ఈ నిధులు నేరుగా, ప్రజలకు చేరుతాయని, వారి జీవితాలు బాగుపడుతాయని పేర్కొన్నారు.

 

Tags :