కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్ తొలగింపు : అమెరికా

కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్ తొలగింపు : అమెరికా

కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్‌ను అమెరికా ఆర్థిక శాఖ తొలగించింది. ఈ జాబితా నుంచి ఇటలీ, మెక్సికో, థాయ్‌లాండ్‌, వియత్నాంలకూ మినహాయింపు లభించింది. అమెరికాతో వాణిజ్యం నిర్వహించే ప్రధాన దేశాలు తమ కరెన్సీ మారకపు విలువకు సంబంధించి అనుసరించే పద్ధతులు, స్థూల ఆర్థిక విధానాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాలో పేర్లు చేర్చడం, తొలగింపులు చేస్తుంటారు. గత రెండేళ్లుగా భారత్‌ ఈ జాబితాలో ఉంది. అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్‌ ఢిల్లీ  పర్యటనలో భారత్‌ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో చర్చలు జరుపుతుండగానే అమెరికా ఆర్థిక శాఖ ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్‌, కొరియా, జర్మనీ, మలేసియా, సింగపూర్‌, తైవాన్‌ మాత్రమే ఉన్నాయి.

 

Tags :
ii). Please add in the header part of the home page.