వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త : అమెరికా

తొలిసారి అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త. ఇలాంటి వారు వీసా ఇంటర్వ్యూ కోసం నిరీక్షించే సమయాన్ని తగ్గించడానికి భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయాలు తొలిసారిగా శనివారం కూడా ఇంటర్వ్యూలు చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ నెల 21న (శనివారం) వీసా ఇంటర్వ్యూలు చేశాయి. వ్యక్తిగతంగా వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారి కోసం ఢిల్లీలోని అమెరికా ఎంబసీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్లోని కాన్సులేట్లు ప్రత్యేకంగా కూడా కార్యకలాపాలు కొనసాగించాయి. రాబోయే నెలల్లో కూడా ఎంపిక చేసిన శనివారాల్లో వీసా దరఖాస్తుదారుల కోసం అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. కొవిడ్ 19 కారణంగా వీసాల జారీ ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొనడంతో పాటు వీసాల కోసం నిరీక్షించాల్సిన సమయం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో అమెరికా దౌత్య కార్యాలయాలు ఈ మేరకు పలు చర్యలు చేపడుతున్నాయి. .