ఉక్రెయిన్‌కు అమెరికా సంస్థ బంపర్ ఆఫర్

అమెరికాకు చెందిన ప్రముఖ అధునాతన సైనిక నిఘా డ్రోన్‌ల తయారీ సంస్థ ఉక్రెయిన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం ఒక డాలర్ (రూ.82) ఖరీదుకు రెండు డ్రోన్లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ఉక్రెయిన్‌కు శక్తివంతమైన గ్రే ఈగిల్, రీపర్ డ్రోన్‌లను అందించాలని వాషింగ్టన్‌ను నెలల తరబడి కోరుతూనే ఉన్నామని జనరల్ అటామిక్ ఏరోనాటికల్ సిస్టమ్స్ తెలిపింది. అఫ్గానిస్తాన్, సిరియా, ఇరాక్ ఇతర సంఘర్షణ ప్రాంతాలపై నిఘా, లక్ష్య దాడులలో అమెరికా డ్రోన్లు గొప్ప ప్రభావాన్ని చూపాయి. మద్యస్థ ఎత్తులో ఎక్కువ దూరం ప్రయాణించగల డ్రోన్‌లు రష్యా బలగాలకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ఉక్రెయిన్‌కు అవసరమైన అత్యంత స్పష్టమైన, బలాన్ని పెంచే సాంకేతికతల్లో ఒకటిగా ఉంటాయని భావిస్తున్నారు.
Tags :