హెచ్-1బీ వీసాల కేటాయింపు.. మళ్లీ పాత పద్దతిలోనే

హెచ్-1బీ వీసాల కేటాయింపు.. మళ్లీ పాత పద్దతిలోనే

హెచ్‌-1బీ వీసాల కేటాయింపును పాత పద్ధతిలో లాటరీ విధానంలోనే కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్‌ 1బీ వీసాలను  జారీ చేస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు అందిన విషయం గమన్హాం. అత్యంత ప్రతిభావంతులైన వృతి నిపుణులనే అమెరికాలోకి అనుమతించాలనే ఉద్ధేశంతో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం లాటరీ పద్ధతికి స్వస్తి పలికి ఈ ఏడాది జనవరి 8న కొత్త విధానాన్ని తెచ్చింది. వేతనాల ఆధారంగా హెచ్‌-1 బీ వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. అత్యధిక వేతనాలు పొందుతున్న వారికే ప్రాధాన్యత క్రమంలో మొదట వీసాలు దక్కుతాయి. ఈ ఏడాది మార్చి 9 నుంచి దీన్ని అమలు  చేయాలని భావించినా అది ఆలస్యమైంది. సెప్టెంబరులో వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది.  దాంతో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధిక వేతనాల ఆధారంగా హెచ్‌ 1-బీ వీసాలను జారీ చేస్తే ఇతర దేశస్తుల కంటే భారత టెకీలకు అధిక ప్రయోజనం కలుగుతుంది.

 

Tags :