అమెరికా నౌక దళ చరిత్రలో.. మొట్టమొదటిసారిగా

అమెరికా నౌక దళ చరిత్రలో.. మొట్టమొదటిసారిగా

అమెరికా నౌకా దళ చరిత్రలో మొట్టమొదటిసారిగా అణు ఇంధనంతో నడిచే విమానవాహక నౌకకు  ఓ మహిళ నాయకత్వం వహిస్తున్నారు. అణుశక్తి నౌక యు.ఎస్‌.ఎస్‌ అబ్రహం లింకన్‌ సారథిగా నియమితులైన కెప్టెన్‌ బావర్న్‌ష్మిట్‌ ఆ ఆరుదైన గౌరవం  చేజిక్కించుకున్నారు. అబ్రహాం లింకన్‌ నౌక సముహంలో అత్యాధునిక యుద్ద విమానాలు, ఒక గైడెడ్‌ మిసైల్‌ క్రూయిజర్‌ నౌక, మూడు డిస్ట్రాయర్‌ నౌకలు ఉంటాయి. ఈ సముహం ఇండో`పసిఫిక్‌ జలాలకు పయనమై వెళుతోంది. అబ్రహం లింకన్‌ నౌక 294 రోజుల పాటు ప్రపంచ సముద్రాలను చుట్టివచ్చిన తరువాత ఏప్రిల్‌ నుంచి మరమ్మతు పనులు పూర్తి చేసుకని తిరిగి సముద్ర ప్రవేశం చేసింది. బావర్న్‌ష్మిట్‌ గతంలో హెలికాప్టర్‌ సముద్ర దళానికీ నాయకత్వం వహించారు. ఆమెకు మొత్తం 3,000 గంటల సేపు విమానాలు, హెలికాప్టర్లను నడిపిన అనుభవం ఉంది. గత ఏడాది ఆగస్టుల కెప్టెన్‌ వాల్ట్‌ స్లాటర్‌ నుంచి బావర్‌ష్మిట్‌ కమాండ్‌ బాధ్యతలు స్వీకరించారు.

 

Tags :