సీఎం కేసీఆర్ ధర్నా చేయడం హాస్యాస్పదం : ఉత్తమ్

సీఎం కేసీఆర్ ధర్నా చేయడం హాస్యాస్పదం  : ఉత్తమ్

వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్షల కోట్ల బడ్జెట్‌లు ఎందుకు అని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దాని మీద ఒకటి నెపం వేసుకొని రైతులకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు బీజేపీ ప్రతిపాదనలకు అనుకూలంగా చాలా సార్లు ఓట్లు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రబీ పంటలో ఆంక్షలు పెట్టొదని, ఖరీప్‌ పండిరచే వరి పంట కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతాంగం పక్షాన కాంగ్రెస్‌ పార్టీ నిలబడుతుందని అన్నారు.

 

Tags :