ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత

ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూశారు. హైద‌రాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 8 గంటల 30 నిముషాలకు ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ ,జీవిత రాశేఖర్ సినీ హాస్పిటల్‌కి వెళ్లి ఉత్తేజ్‌ని పరామర్శించారు. పద్మావతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఉత్తేజ్‌ చేసే పలు సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగం పంచుకునేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. ఉత్తేజ్‌కి చెందిన వస్త్ర వ్యాపారాన్ని కూడా పద్మావతి నిర్వహించేవారు. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు చేతన ఉత్తేజ్, పాట. పెద్దమ్మాయి చేతన బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది. చిన్న కూతురు పాట‌కి కూడా మంచి టాలెంట్ ఉంది. రీసెంట్‌గా అకీరా నందన్ పియానో వాయిస్తూ ఉండగా, పాట అద్భుతంగా పాడి అందరినీ ఆకర్షించింది.

నటుడిగానే గాక రచయితగా ఎంతో టాలెంట్ ఉన్న ఉత్తేజ్.. పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ఆ తర్వాత నటుడిగా మారారు. మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ లాంటి సినిమాలకు సంభాషణలు రాసిన ఆయన.. మొత్తం 200 పైగా చిత్రాల్లో నటించారు.

 

Tags :