ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన వకీల్ సాబ్

ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన వకీల్ సాబ్

సుదీర్ఘ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్.. హిందీలో సూపర్ హిట్ సినిమా పింక్ కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కు జోడీగా ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటించగా, నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న వకీల్ సాబ్ కోసం అందరూ ఎంతో ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మిస్ పల్లవి, మీరు వర్జినేనా...? అని నివేదా ను లాయర్ రూపంలో ఉన్న ప్రకాశ్ రాజ్ అడగడంతో మొదలైన ట్రైలర్.. ఫ్రెండ్స్ అని నమ్మిన కొందరు అబ్బాయిల చేతిలో మోసపోయి లైంగిక దాడికి గురైన ముగ్గురు యువతుల స్టోరీనే వకీల్ సాబ్. ఆ ముగ్గురు అమ్మాయిలకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. వారి తరపున వాదించే లాయర్ గా పవన్ కళ్యాణ్ ఇందులో కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే.. పవన్ ఇమేజ్ ని మైండ్ లో పెట్టుకుని, ఒరిజినల్ సోల్ ని మిస్ చేయకుండా చాలానే మార్పులు చేసినట్లు అర్థమవుతుంది.

లాయర్ పాత్రలో పవన్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, ఫైట్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది ట్రైలర్. అంజలి,  నివేదా, అనన్య లు చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేసినట్లు అర్థమవుతుంది. ట్రైలర్ చివర్లో నువ్వు వర్జినేనా..? అని పవన్ బోనులో ఇంకో వ్యక్తిని ప్రశ్నించడం, ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ గా మీరైతే అమ్మాయిలను అడగొచ్చు, నేను అబ్బాయిలను అడక్కూడదా...? ఇదెక్కడి న్యాయం నందా జీ అనే పవన్ ఇచ్చే కౌంటర్ బాగా హైలైట్ అయింది. దీనికి థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, పీఎస్ వినోద్ విజువల్స్ సరిగ్గా సరిపోయాయి. మొన్నటి వరకు అసలు బజ్ లేదు అనుకుంటున్న ఈ వకీల్ సాబ్ కు ట్రైలర్ తో అంచనాలను ఆకాశాన్నంటించాడు. మరి ఈ అంచనాలకు ఏ మేర తీర్పు వస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 9వరకు ఆగాల్సిందే.

Tags :