స్వాన్ మూవీస్ ''వాలెంటైన్స్ నైట్'' ట్రైలర్ విడుదల

స్వాన్ మూవీస్ ''వాలెంటైన్స్ నైట్'' ట్రైలర్ విడుదల

సునీల్, చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలలో స్వాన్ మూవీస్ సమర్పణలో ఫన్ సాగ బ్యానర్ పై అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ''వాలెంటైన్స్ నైట్'. తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి, మహీంధర్ (MO) నారల నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ రచయిత, నటుడు హర్ష వర్ధన్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

'లైఫ్ లో అన్నీ సడన్ గానే వస్తాయి ప్రియా. సడన్ గానే పోతాయి. మన ప్రేమలాగ' అని చైతన్య రావు డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. లవ్, ఫ్రండ్షిప్, రోమాన్స్, యాక్షన్, థ్రిల్, సస్పెన్స్ .. అన్ని  ఎలిమెంట్స్ తో ట్రైలర్ క్యురియాసిటీని పెంచింది. ప్రధాన పాత్రల జీవితంలో వాలెంటైన్స్ నైట్ రోజు ఏం జరిగిందో అనే కధాంశం చాలా ఆసక్తికరంగా వుంది.

చైతన్య రావు పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. సునీల్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా టెర్రిఫిక్ గా కనిపించారు. లావణ్య, పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, రవి వర్మ, పాత్రలు ఆసక్తికరంగా వున్నాయి. జయపాల్ రెడ్డి కెమరాపని తనం ఆకట్టుకుంది. అనిల్ గోపిరెడ్డి బ్రిలియంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నిర్మాణ విలువలు అత్యున్నతంగా వున్నాయి.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అనిల్ గొప్పగా తీశాడు. చాలా మంచి మ్యూజిక్ కూడా ఇచ్చాడు. తన ప్రయత్నం సఫలీకృతం కావాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.

చైతన్య రావు మాట్లాడుతూ.. 'వాలెంటైన్స్ నైట్'' చాలా ఆసక్తికరమైన కథ. అనిల్, జైపాల్ అన్న నా కెరీర్ బిగినింగ్ నుండి తెలుసు. వారితో ఎప్పటి నుండో వర్క్ చేయాలని వుండేది. ఈ సినిమాతో కుదిరింది.  జైపాల్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇందులో చాలా సవాల్ తో కూడిన పాత్ర చేశాను. అనిల్ అద్భుతంగా తీశారు. లావణ్య చాలా మంచి నటి. చాలా పెద్ద స్టార్ అవుతుంది. ఈ సినిమాలో పని చేసిన నటీనటులుకు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరూ సినిమాని సపోర్ట్  చేయాలి'' అని కోరారు.

దర్శకుడు అనిల్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన హర్ష వర్ధన్ గారికి థాంక్స్. ఈ సినిమా 90శాతం షూటింగ్ నైట్ లో చేశాం. నైట్ షూట్ చేయడం అంత ఈజీ కాదు. అయితే సినిమా ఇంత రిచ్ గా రావడానికి  మెయిన్ పిల్లర్ మా డీవోపీ జయపాల్ రెడ్డి. అద్భుతంగా తీశారు. మా నిర్మాతలు నన్ను ఎంతో నమ్మారు.  చైతన్య అద్భుతమైన నటుడు. లావణ్య చక్కగా నటిచింది. సునీల్ గారు ఇందులో చాలా కీలక పాత్ర చేశారు. ఆయనకి కృతజ్ఞతలు. మన జీవితం మన చేతిలో వుండదు. మనం ఒక నిర్ణయం తీసుకుంటే అవతలి వారి జీవితం మీద కూడా ప్రభావం పడుతుంది. 14 పాత్రల మధ్య వాలెంటైన్స్ నైట్ రోజు ఏం  జరిగిందో .. అదే ఈ కథ. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాం. ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకం వుంది'' అన్నారు.

లావణ్య మాట్లాడుతూ.. సినిమా చాలా బావొచ్చింది. సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి' అని కోరారు.

నిర్మాత సుధీర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడ్డాం. మా బ్యానర్ నుండి భవిష్యత్ లో మంచి సినిమాలు వస్తాయి. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.

ఈ ఈవెంట్లో లోబో, ముక్కు అవినాష్, కార్తిక్, చరణ్, స్వాతి రాపేటి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :