28వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

28వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
(1994 లో సంస్థాపించబడిన లాభాపేక్ష లేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ)
3906 Sweet Hollow Court, Sugar Land, TX 77498
Phone: 1 832 594 9054; E-mail: vangurifoundation@gmail.com

28వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 5, 2023)

గత 28 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే "శోభకృతు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 22, 2023) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 28వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం

భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  US116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ US$116

మొట్టమొదటి రచనా విభాగం

భారత దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ "పోటీ" లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

"నా మొట్టమొదటి కథ": (ఉత్తమ కథ):  US$116
"నా మొట్టమొదటి కవిత": (ఉత్తమ కవిత): US$116

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించ వచ్చును. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (ఉదా. గౌతమి ఫాంట్స్) లో మాత్రమే పంపించాలి. కథల నిడివి 2500 పదాలకు మించకూడదు. (సుమారు 15 పేజీల లోపు). కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.PDF, JPEG లలో పంపించినా ఆమోదయోగ్యమే.
  • తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.
  • రచయితలఅముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణకి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి. కామ్, తదితర పత్రికలలోనూఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు(మార్చ్ 22, 2023) కాని, అంతకు ముందు కానీ   ప్రకటించబడతాయి. కాపీ రైట్స్  ఆయా రచయితలవే అయినా, ఆ ఈ తేదీ లోపుగా పోటీకి పంపిన రచనలను  రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
  • అమెరికా విజేతల బహుమతులు, వీలుంటే అన్ని దేశాల విజేతల బహుమతులు ఈ సంవత్సరం జరగబోయే13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో సభా ముఖంగా అందజేయ బడి,  బహుమతి పొందిన రచనలు చదివి వినిపించే అవకాశం కల్పించబడుతుంది. అమెరికాలో ఈ సదస్సు జరిగే నగరం, తేదీలు త్వరలోనే ప్రకటించబడతాయి.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries: March 5, 2023

Please send entries by email attachments (PDF, JPEG or Unicode fonts)

sairacha@gmail.com  &  vangurifoundation@gmail.com

వాట్సప్: 1 832 594 9054

వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, టెక్సస్

 

 

Tags :