మహానంది క్షేత్రంలో ఈరోజు ఘనంగా జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రతం

ముందుగా అలంకార మండపం నుండి వరలక్ష్మీ అమ్మవారి కలశంతో పాటు పూజాద్రవ్యాలతో మహిళలు ప్రదక్షిణంగా అభిషేకమండపం చేరన తరువాత గణపతి పూజ, పీఠార్చన అనంతరం వరలక్ష్మీ షోడశోపచార పూజ, తోరణపూజ చేసి వ్రతకథాశ్రవణం తదుపరి మహిళలు తోరాలను కట్టుకుని పూజానంతరం వరలక్ష్మీ అమ్మవారిని కోనేరులో కలిపారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి & సుధాకుమారి దంపతులు, దాతలు అవ్వారు గౌరినాథ్ & సరస్వతి దంపతులు వందలాదిగా తరలివచ్చిన మహిళలకు వాయనాలు ప్రసాదాలిచ్చి సాగనంపారు. కార్యక్రమంలో ఆలర ధర్మకర్తలు ఏఈఓ, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
Tags :