మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు ఘాటైన వ్యాఖ్యలు.. కవ్మ వర్గానికి

మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు ఘాటైన వ్యాఖ్యలు.. కవ్మ వర్గానికి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం జగన్‌ కమ్మ వర్గానికి అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో నిర్వహించిన కమ్మవారి వనభోజనాల కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన  మీడియాతో మాట్లాడుతూ నేను ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో మంత్రిగా  పని చేసిన, ఆయన మంత్రి వర్గంలో వారిని ఎంతో గౌరవించే వారు అన్నారు. ఎన్టీఆర్‌ వర్సిటీ ప్రారంభంలో నేను పాల్గొన్నారు. అక్కడ శిలా ఫలకాల మీద నాపేరు, ఎన్టీఆర్‌ పేరు, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి పేరు ఇప్పటికీ ఉన్నాయన్నారు. కానీ వ్యవస్థల పేర్లు మార్చిన చరిత్రంలో గతం లేదు. ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఎవరూ స్పందించకపోవడం శోచనీయం. ఏపీ కేబినెట్‌లో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు లేకపోవడం దురదృష్టకరం అన్నారు. కమ్మవారి రాష్ట్రం అయ్యిండి, ఇక్కడ ఒక్క మంత్రి కూడా లేకపోవడం పక్కా రాష్ట్రాల్లో కమ్మవారికి ఎంతో మందికి మంత్రి పదవులు ఉన్నాయి అని అన్నారు.                                                                                                                                                                              

 

Tags :
ii). Please add in the header part of the home page.