పరిటాల స్పూర్తితో వీరసింహా రెడ్డి!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా వీరసింహా రెడ్డి. సంక్రాంతి రేసులో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వీరసింహారెడ్డి క్యారెక్టర్ పరిటాల రవిని స్పూర్తిగా తీసుకునే రాసుకున్నట్లు గోపీచంద్ మలినేని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
పరిటాల గురించి తాను వినింది, చదివింది గుర్తు చేసుకుని ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు గోపీచంద్ వివరించాడు. వీరసింహా రెడ్డి ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తిగా ఆయన్ను దృష్టిలో ఉంచుకునే చేసినట్లు గోపీ వెల్లడించాడు. ఓ సందర్భంలో పోలీసులు తనని తనిఖీ చేస్తున్నప్పుడు, పరిటాల తన జీపుకు ఆనుకుని దానితో సంబంధం లేనట్లు స్టైల్‌గా సిగరెట్ తాగుతున్న ఫోటోను పేపర్లో చూశానని, అది గుర్తుంచుకునే వీరసింహా రెడ్డి ఇంటర్వెల్లో చనిపోయే సీన్‌లో కూడా స్టైల్‌గా బాలయ్య చుట్ట తాగే సీన్ పెట్టినట్లు గోపీ చెప్పాడు.
వీరసింహారెడ్డిని శత్రువులు విదేశాల్లో చంపడం వెనుక కూడా పరిటాల రవి గురించి తాను తెలుసుకున్న ఓ విషయం స్పూర్తిగా నిలిచిందని వెల్లడించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. పరిటాల మీద ఎటాక్ జరిగి చనిపోయే ముందు ఆయన్ని అమెరికా ట్రిప్‌కు ఇన్వైట్ చేశారని, ఆ టూర్‌కు వెళ్లి ఉంటే పరిటాల బతికి ఉండేవారని అంటారని, అలా కాకుండా ఆయన విదేశాలకు వెళ్లి అక్కడ ఆయన మీద ఎటాక్ జరిగితే అని ఆలోచించి ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ పెట్టినట్లు గోపీచంద్ వెల్లడించాడు.