ధనుష్ 'నేనే వస్తున్నా' చిత్రం నుండి "వీరా సూర ధీర రారా" సాంగ్ రిలీజ్ 

ధనుష్ 'నేనే వస్తున్నా' చిత్రం నుండి "వీరా సూర ధీర రారా" సాంగ్ రిలీజ్ 

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. "నేనే వస్తున్నా" పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి "వీరా సూర ధీర రారా" పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటను చంద్రబోస్ రచించారు.

"వీరా సూర ధీర రారా
మతి బెదర
గతి చెదర
అడవంతా నీ అధికారం ఔరా"

లాంటి లైన్స్ ధనుష్ కి ఎలివేషన్ తో పాటు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ నంబియార్ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. “కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై  "కలైపులి ఎస్ థాను" నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.

 

 

Tags :