రాజకీయాలకు అర్వింద్ ఓ కళంకం.. వేముల ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు

రాజకీయాలకు అర్వింద్ ఓ కళంకం.. వేముల ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై టీఆర్ఎస్ నేత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అర్వింద్ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం కలుగుతుందని అన్నారు. అర్వింద్ అంటేనే అబద్దాల పుట్ట, నిలువెత్తు అబద్దమని విమర్శలు చేశారు. బాండ్ పేపర్ రాసిన మాటకు కూడా తప్పిన ఘటన అర్వింద్‌కే దక్కుతుందని, అతడిని ప్రజలు తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడారని వస్తున్న అర్వింద్ వ్యాఖ్యలపై వేముల ఘాటుగా స్పందించారు. పార్టీలు మారే అలవాటు మాటలు మార్చే గుణం ఉన్నది అర్వింద్‌కే అన్నారు. రాజకీయాలకే అర్వింద్ ఓ కళంకమని అన్నారు. ఖర్గేతో కవిత మాట్లాడారన్న విషయాన్ని అర్వింద్ కలగన్నారా? అంటూ ప్రశ్నించారు. మార్టీలు మారడం అర్వింద్ కుటుంబంలోనే ఉందని, ముగ్గురూ మూడు పార్టీల్లో ఉన్నారని అన్నారు. అర్వింద్ ఇంటిపై దాడులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇళ్లపై దాడులు చేసే ఆటను ప్రారంభించింది ఎవరని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేతులకు గాజులు తొడుక్కోలేదని, మేమూ ఉప్పూకారం తినే పెరిగామని, మాకూ కోపాలు పౌరుషాలు ఉంటాయని అన్నారు. అనంతరం అర్వింద్‌పై కవితన చేసిన వ్యాఖ్యలను వేముల సమర్థించారు. తండ్రే బిడ్డను అమ్ముకుంటున్నాడు అని రాజకీయాల చరిత్రలో ఎవరైనా అన్నారా? బుద్దిన వారు ఎవరైనా అంటారా? అని ప్రశ్నించారు. వాళ్ల ఇంటి ఆడబిడ్డలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారు మాత్రం ఊరుకుంటారా అని మండిపడ్డారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.