పదవి లేకున్నా ప్రజా సేవలో : వెంకయ్య నాయుడు

పదవి లేకున్నా  ప్రజా సేవలో : వెంకయ్య నాయుడు

ఉప రాష్ట్రపతిగా పదవీ కాలం ముగిసిన తర్వాత దేశ సేవలో నిమగ్నమవుతానని వెంకయ్య నాయుడు తెలిపారు. రాష్ట్రపతి పదవి దక్కలేదన్న అసంతృప్తి తనకు ఎంతమాత్రం లేదని మరోసారి స్పష్టంచేవారు. ఢిల్లీలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులకు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా తనకు మద్దతుగా నిలిచిందని, అందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. రాజ్యసభ చైర్మన్‌గా గత ఐదేళ్లలో తన వంతు ఉత్తమైన సేవలు అందించానని తెలిపారు. సంతృప్తితో పదవి నుంచి తప్పుకుంటున్నానని వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య పదవీ కాలం బుధవారం (ఆగస్టు 10)తో ముగిసింది.

 

Tags :