పేద విద్యార్థులకు వెంకట్‌ కోగంటి చేయూత

పేద విద్యార్థులకు వెంకట్‌ కోగంటి చేయూత

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ‘చేయూత’ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేద విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్ షిప్స్ అందజేస్తున్నారు. డిసెంబర్‌ 29వ తేదీన హైదరాబాద్‌ లో నిర్వహించిన తానా చేయూత కార్యక్రమానికి కాలిఫోర్నియాలోని వెంకట్‌ కోగంటి స్పాన్సర్‌ చేసారు. ఈ చేయూత ప్రాజెక్ట్‌ ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ చెక్స్‌ అందించారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకట రమణ యార్లగడ్డ చేతుల మీదుగా చెక్స్‌ పంపిణి జరిగింది. ఈ కార్యక్రమం ఫౌండేషన్‌ సెక్రటరీ మరియు చేయూత ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ శశికాంత్‌ వల్లేపల్లి నిర్వహణలో జరిగింది. తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ జనార్దన్‌ నిమ్మలపూడి, క్రీడా కార్యదర్శి శశాంక్‌ యార్లగడ్డ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :