వెంకీ మామ మాస్ ఈసారి మామూలుగా ఉండదట..

ఫ్యామిలీ సినిమలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విక్టరీ వెంకటేష్ మాస్ సినిమా తీస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని తెలిసిందే. వెంకటేష్ తన కెరీర్లో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశాడు. అయితే వెంకీ ఒక్కసారి డిసైడ్ సీరియస్ సినిమాలు చేస్తే మాత్రం ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.
ఓ పక్క ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తూ మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చారు వెంకీ. ప్రస్తుతం వెంకీ చేస్తున్న యాక్షన్ మూవీ సైంధవ్. హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హిట్1, హిట్2 సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శైలేష్, వెంకీతో సైంధవ్ అంటూ ఓ కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్‌ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీ స్టోరీ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుందని సమాచారం. సినిమా అవుట్‌పుట్ కూడా బాగా వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నారు. వెంకీ ఈసారి ఇయర్ ఎండింగ్‌కి మాస్ ట్రీట్ ఇచ్చేందుకు వెంకటేష్ సిద్ధమవుతున్నాడు.
నారప్ప తర్వాత వెంకీ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అయితే సైంధవ్ కెరీర్లో చాలా స్పెషల్ అని తెలుస్తుంది. ఈ మూవీలో వెంకీ లుక్స్, బాడీ లాంగ్వేజ్, కంప్లీట్ మాసీగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీకి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని టాక్. వెంకీ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కుతున్న సైంధవ్ ఏ మాత్రం అలరిస్తుందో చూడాలి.