కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌(80) తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని మంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫెర్నాండెజ్‌ ఈ రోజు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడిరచారు. జులైలో యోగా చేస్తూ పడిపోవడంతో ఆయన తలకు గాయమై, రక్తం గడ్డ కట్టింది. అనంతరం వైద్యులు శస్త్రచికిత్స చేసి, గడ్డను తొలగించారు. అప్పటినుంచి ఐసీయూలో ఉంచి వైద్య అందిస్తున్నట్లు వారు తెలిపారు. యూపీఏ హయాంలో పెర్నాండెజ్‌ కేంద్ర రోడ్డు రవాణా శాఖ, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వహించారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగానూ పనిచేశారు. 

కర్ణాటకలోని ఉడుపి నియోజకవర్గం నుంచి 1980లో ఫెర్నాండెజ్‌ మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు.  ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను రాజ్యసభకు నామినెట్‌ చేసింది.  ఫెర్నాండేజ్‌ మృతి పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర కాంగ్రెస్‌ నేతలు సంతాపం ప్రకటించారు.

Tags :