లంక ప్రధానిగా విక్రమ సింఘే

లంక ప్రధానిగా విక్రమ సింఘే

శ్రీలంక నూతన ప్రధాన మంత్రిగా రణిల్‌ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకు ముందు ఐదుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన విక్రమసింఘేను ప్రధానిగా చేయాలని దేశాధ్యక్షులు గొటాబాయ నిర్ణయించారు. దేశాధ్యక్షులు గొటాబాయ మాజీ ప్రధాని అయిన విక్రమసింఘేతో రహస్య మంతనాలు నిర్వహించారు. ఇతర నేతలు, రాజ్యాంగ న్యాయ నిపుణులతో చర్చలు తరువాత విక్రమసింఘేను ప్రధానిగా నియమిస్తున్నట్లు దేశాధ్యక్షడిగా నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. 73 సంవత్సరాల విక్రమసింఘే దేశంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యుఎన్‌పి) నేతగా ఉన్నారు. ఈ పార్టీకి పార్లమెంట్‌లో కేవలం ఒక్క సీటే ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ, ఆర్థిక విషయ పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించే అనుభవం ఉంది. ఇంతకు ముందు నాలుగు సార్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా పేరొందిన విక్రమసింఘే పేరుకు ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జెబిలోని ఓ వర్గం, అధికార పక్షం ఎస్‌ఎల్‌పిపి మద్దతు తెలిపినట్లు వెల్లడైంది.

 

Tags :