కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం - హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అపోలో

కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం - హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అపోలో

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఈరోజు ఉద‌యం అపోలో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్యంపై ప‌లు ర‌కాల వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అపోలో హాస్పిట‌ల్ కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచింది. టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఈరోజు ఉద‌యం అపోలో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్యంపై ప‌లు ర‌కాల వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అపోలో హాస్పిట‌ల్ కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచింది. ‘‘ఈరోజు (శనివారం) ఉదయం 7గంటల 30 నిమిషాలకు అపోలోలో జాయిన్ అయ్యారు. ఆయన ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మస్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఆయన పోస్ట్ కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. ఆయ‌న శ‌రీరంలో అవ‌య‌వాలు స‌రిగా స్పందించ‌డం లేదు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ప‌లువురు డాక్ట‌ర్స్ స‌మీక్షిస్తున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంది’’ అన్నారు.

దాదాపు 800 చిత్రాల్లో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, ప్ర‌తి నాయ‌కుడిగా, క‌మెడియ‌న్ ఇలా అన్నీ ర‌కాల ప్రాత‌ల‌ను పోషించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. 60 సంవత్సరాలుగా తెలుగు సినిమారంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. అలాగే హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1996లో మ‌చిలీప‌ట్నం లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని యావ‌త్ సినీ ఇండ‌స్ట్రీ కోరుకుంటోంది.

 

Tags :