వెండితెర సత్యభామ జమున కన్నుమూత

సీనియర్ నటి జమున (86) నేడు కన్నుమూశారు. హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1936 ఆగస్ట్ 30న హంపిలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున.. హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య సహా పలువురు దిగ్గజ నటులతో నటించారు. జమున 1936 ఆగస్టు 30న కర్నాటక రాష్ట్రం హంపీలో జన్మించారు. ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. కాగా, ఆమె తొలి చిత్రం పుట్టిల్లు. అయితే సినీనటుడు జగ్గయ్యది అదే గ్రామం కావడం వల్ల జమున కుటుంబానికి కొంత పరిచయం ఉండేది.
ఆ సమయంలోనే నాటకాలకు ఆకర్షితురాలైన జమున చూసి తన నాటకాలలో అవకాశం ఇచ్చారు జగ్గయ్య. అలా ఆమె తొలిసారి ఖిల్జీ రాజ్య పతనం, మా భూమి వంటి నాటకాలలో ప్రదర్శన చేశారు‘మా భూమి’ నాటకం చూసి డాక్టర్ గరికిపాటి రాజారావు ఆమెకు మొదటి సినీ అవకాశాన్నిచ్చారు. అలా జమున మొదటిసారి 1952లో విడుదలైన ‘పుట్టిల్లు’ సినిమా కోసం పనిచేశారు. గడుసైన పాత్రలు, ముఖ్యంగా సత్యభామ పాత్రకు కేరాఫ్ అడ్రస్గా ఆమె నిలిచారు.