ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి వీడ్కోలు

ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడుకి వీడ్కోలు

ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ఎం. వెంకయ్య నాయుడి పదవీకాలం ఈ నెల 10తో ముగుస్తున్నందున ఆయనకు 8వ తేదీన వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రం 6:15 గంటలకు పార్లమెంటు ప్రాంగణం లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సచివాలయం పేర్కొంది. ఈ సందర్భంగా ఎగువ సభ సభ్యులతో గ్రూప్‌ ఫొటో కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. వెంకయ్య నాయుడి గౌరవార్థం సభ్యులకు రాత్రి విందు ఇవ్వనున్నారు.

 

Tags :