హైదరాబాద్ లో యోధా లైఫ్ లైన్ డియాగ్నోస్టిక్స్ సెంటర్ ప్రారంభించిన ఉప రాష్ట్రపతి

హైదరాబాద్ లో యోధా లైఫ్ లైన్ డియాగ్నోస్టిక్స్ సెంటర్ ప్రారంభించిన ఉప రాష్ట్రపతి

అమెరికా లో డల్లాస్ లో ఉంటూ టెక్సాస్, అలబామా, వర్జీనియా రాష్ట్రాలలో ఆధునిక ప్రమాణాలతో డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తున్న సుధాకర్ కంచర్ల హైదరబాద్ లో ఏర్పాటుచేసిన యోధా లైఫ్ లైన్ డయాగ్నొస్టిక్ సెంటర్ ని ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, శ్రీ చిరంజీవి, శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ మరియు ఇతర ప్రముఖుల సమక్షం లో ప్రారంభించారు.

శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ

జనంతో మమేకమై ఉండటమే తనకు ఇష్టమని అన్నారు. ప్రొటోకాల్‌ తనను జనానికి దూరం చేస్తోందని, మరోసారి తాను పదవిని ఆశించడం లేదని తెలిపారు. రాజకీయం మీద తనకు ఆసక్తి తగ్గిందని, రాజకీయ రంగం కూడా పరిమళంగా లేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిగా చూడాలని ప్రతి తెలుగువ్యక్తి కోరుకుంటున్నారని చిరంజీవీ పేర్కొనగా ఆయన పైవిధంగా స్పందించారు. చిరంజీవి నాపై అభిమానంతో అలా అంటున్నారు. ఇది చాలా మంది అంటున్నదే. నేను ఆ పదవిని ఆశించడం లేదు. ఎవరు ప్రతిపాదించనూ లేదు. చిరంజీవి కూడా రాజకీయాలకూ దూరమై మంచి పనిచేశారు. కళామతల్లికి సేవచేసుకుంటున్నారు అని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అధునిక రోగ నిర్థారణ కేంద్రాన్ని స్థాపించిన యోధా లైఫ్‌లైన్‌ కేంద్రం నిర్వాహకులు కంచర్ల సుధాకర్‌ను అభినందించారు.

మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభం వలన వైద్య సదుపాయాలు అవసరం అని అందరికి తెలిసిందని, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఇంత ఆధునిక సదుపాయాలతో యోధా లైఫ్ లైన్ డియాగ్నోటిక్ సెంటర్ ఏర్పాటు చేసిన శ్రీ సుధాకర్ కంచర్ల అభినందనీయులు అన్నారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆధునిక వైద్య సేవలను పేదలకు చేరువచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నగరంలో పలు చోట్ల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి చర్యలు చేపట్టారని అన్నారు.

ఈ సందర్భంగా డయాగ్నస్టిక్‌  కేంద్ర నిర్వాహకులు కంచర్ల సుధాకర్‌ రూ.25 లక్షల చెక్కును చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు వెంకయ్యనాయుడు చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌, బ్మాడ్మింటన్‌  జాతీయ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ హారిక ద్రోణవల్లి, సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పాల్గొన్నారు.

Click here for Event Gallery

 

Tags :