ఈ నెల 19న విశాఖకు ఉపరాష్ట్రపతి రాక

ఈ  నెల 19న విశాఖకు ఉపరాష్ట్రపతి రాక

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈనెల 19న విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకొని పోర్టు అతిథి గృహంలో బస చేయనున్నారు. 20న ఇండియన్‌ సైక్రియాట్రిక్‌ సొసైటీ 73వ వార్షిక సదస్సులో పాల్గొంటారు. 21న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. 22వ తేదీ సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళాతారు. ఈ మేరకు సమాచారం రావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

 

Tags :