అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రష్యా పర్యటన

అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రష్యా  పర్యటన

అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విక్టోరియా నూలండ్‌ ఈ నెల 11 నుంచి 13 వరకు రష్యా రాజధాని మాస్కోలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా తెలిపారు. పర్యటనలో భాగంగా విక్టోరియా పలువురు మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారని తెలిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపైనే ప్రధానంగా చర్చలు ఉంటాయని అమెరికా దౌత్యవర్గాలు పేర్కొన్నాయి. మాస్కో పర్యటన అనంతరం నూలండ్‌ 14న బీరుట్‌, 15న లండన్‌కు వెళ్తారని అధికారులు తెలిపారు.

 

Tags :