త్వరలో వియత్నాం నుంచి హైదరాబాద్ కు.. విమాన సేవలు

త్వరలో వియత్నాం నుంచి హైదరాబాద్ కు.. విమాన సేవలు

వియత్నాం విమానయాన సంస్థ వీట్‌జెట్‌ హైదరాబాద్‌తో పాటు మనదేశంలోని మరో 4 నగరాలకు విమాన సేవలు ప్రారంభించనుంది. వియత్నాంలో సముద్ర తీర ప్రాంత నగరమైన డా నాంగ్‌ నుంచి భారతదేశంలోని హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు నిర్వహిస్తామని వీట్‌జెట్‌ వెల్లడించింది. ఈ సంవత్సరాతానికి ఈ సేవలు ప్రారంభమవుతాయని తెలిపింది. వారానికి 4`7 విమాన సర్వీసులు ఉంటాయని తెలియజేసింది. దీని వల్ల రెండు దేశాల మధ్య వ్యాపార కార్యకలాపాలు, పర్యాటకుల రాకపోకలు పెరుగుతాయని తెలిపింది. డా నంగ్‌ నగరం అంతర్జాతీయంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. వియత్నాం సాంస్కృతిక రాజధానిగా ఈ నగరానికి పేరుంది.

 

Tags :