కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్, స్టార్ హీరో మధ్య విభేదాలు..

కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్, స్టార్ హీరో మధ్య విభేదాలు..

తమిళ సూపర్ స్టార్ అజిత్ ఈ మధ్య ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నాడు. లేటెస్ట్ గా తునీవు, వారిసు సినిమా విషయంలో దళపతి విజయ్, అజిత్ ఫాన్స్ గొడవల్లో మరింత ఫేమస్ అయ్యాడు ఈ తమిళ హీరో. ఇటు తమిళంలో, అటు తెలుగు లో కూడా తునీవు సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏకే 62 అంటూ కొత్త ప్రాజెక్ట్ తో కోలీవుడ్ ప్రేక్షకులని మెప్పించడానికి రెడీ అవుతున్నాడు హీరో అజిత్. అనుకున్నట్టుగానే షూటింగ్ పనులు ప్రారంభించారు.

ఏకే 62 సినిమాకి ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారని తెలుసు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక వార్త ఇటు విగ్నేష్ ఫాన్స్ ని, అటు అజిత్ ఫాన్స్ ని కూడా కలవరపెడ్తుంది. ఏకే 62 ప్రాజెక్ట్ నుండి విగ్నేష్ శివన్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో కి డైరెక్టర్ కి వచ్చిన బేదాభిప్రాయాల వల్లే దర్శకుడు ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. మాగిస్హ్న్ తిరుమేని ప్రస్తుతం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్టు సమాచారం. విగ్నేష్ ఇక ఈ ప్రాజెక్ట్ లో లేనట్టే అని తెలుస్తుంది.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏకే 62 సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి రెడీగా ఉంది. మరోవైపు విశ్వసుందరి, అందాల నటి ఐశ్వర్య రాయ్ మరియు పాపులర్ హీరో అరవింద స్వామి కూడా ఈ ప్రాజెక్ట్ లో కీలకమైన పాత్రలని పోషిస్తున్నారని టాక్. వీరి పాత్రలని చాలా స్పెషల్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అజిత్ అప్ కమింగ్ మూవీ త్వరలోనే ఏ ఆటంకాలు లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకి రావాలని కోరుకుందాం.

 

 

Tags :