విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయం కానుందా?

విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయం కానుందా?

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తనదైన నటనతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ధడక్' సినిమాతో బీటౌన్లో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు టచ్లో ఉంటుంది. ఇప్పటివరకు బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ త్వరలో సౌత్లో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అది కూడా జాన్వీ ఫేవరెట్ హీరోతో అని టాక్. అతనెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కించే చిత్రంలో విజయ్ దేవరకొండకు పక్కన హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించనుందట. తెలుగు, హిందీతోపాటు ఇతర భాషల్లోనూ విడుదలవుతున్న ఈ సినిమాకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. అయితే 'లైగర్' మూవీలో మందుగా హీరోయిన్గా జాన్వీనే అనుకున్నారట. కానీ కుదర్లేదు. అలాగే జాన్వీని మొదట తెలుగులోనే కథానాయికగా పరిచయం చేయాలనుకున్నారు శ్రీదేవి. ఫైనల్గా ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

 

Tags :