కెనడాలో ఘనంగా వినాయకచవితి వేడుకలు

కెనడాలో ఘనంగా వినాయకచవితి వేడుకలు

కెనడాలోని టొరంటోలో వినాయక చవితి ప్రారంభమైనప్పటి నుంచి భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. పూజల్లో భాగంగా ఘనంగా గణపతి హోమం నిర్వహించారు. ఈనెల 11న లక్ష మోదక హోమంతో వినాయక చవితి సంబురాలు సంప్రదాయంగా చేసుకున్నారు. జీఆర్డీ అయ్యర్స్‌ గురుకుల్‌ వ్యవస్థాపకుడు రమేశ్‌ నటరాజన్‌, గాయత్రి నటరాజన్‌ ఆధ్వర్యంలో కెనడాలోనే తొలిసారిగా ఈ హోమం నిర్వహించారు. స్థానికంగా, అమెరికా నుంచి, ఇండియా నుంచి తయారుచేసి తీసుకొచ్చిన లక్ష మోదకాలను స్వామికి సమర్పించి కొవిడ్‌ నుంచి లోకాన్ని రక్షించాలని కోరారు.

 

Tags :