గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఆసక్తికర సంఘటన

గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఆసక్తికర సంఘటన

ఢిల్లీ రాజ్‌పథ్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకొంది. కవాతు ముగిసిన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరిగి వెళ్లే సమయంలో ఆయన అంగరక్షక దళంలో ముందు వరసులో ఉండే అశ్వం విరాట్‌ కు  కోవింద్‌తో పాటు ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు వీడ్కోలు పలకడం చూపరులను ఆకట్టుకొంది. ఈ అశ్వం విధుల నుంచి  విరామం  పొందుతున్న నేపథ్యంలో మోదీ అప్యాయంగా దాని తలపై నిమిరి వీడ్కోలు పలికారు. హనోవేరియన్‌ జాతికి చెందిన ఈ గుర్రాన్ని 2003లో రాష్ట్రపతి అంగరక్షక దళ కుటుంబంలో చేర్చారు. దీన్ని ప్రెసిడెంట్‌ బాడీగార్డ్‌ ఛార్జర్‌ అని కూడా పిలుస్తారు. గణతంత్ర కవాతులో అత్యంత నమ్మంగా వ్యవహరించే గుర్రంగా దీనికి పేరుంది.

 

Tags :