సీఎం వైఎస్ జగన్ కు స్వామి స్వాత్మానంద ఆహ్వానం

సీఎం వైఎస్ జగన్ కు స్వామి స్వాత్మానంద ఆహ్వానం

ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి ఆహ్వానించారు. ఇందులో భాగంగా తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. అంతుకు ముందు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు.

 

Tags :