అంగరంగ వైభవంగా విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు

విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు సాగే ఉత్సవాలకు మహాగణపతి పూజతో అంకురార్పణ చేశారు. పీఠం అధిష్ఠాన దైవం రాజశ్యామాల అమ్మవారి యాగ క్రతువు కూడా ప్రారంభమైంది. రాజస మంత్రంతో హవన పూర్వకంగా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. మోదుగ పువ్వు తరహా విశేష ద్రవ్యాలను యాగంలో వినియోగిస్తున్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్మాత్మానందేంద్ర స్వామివార్లు యాగశాల ప్రవేశం చేసి ఈ క్రతువును ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది. టీటీడీ నిర్వహణలో శ్రీనివాస చదుర్వేత హవనం కూడా పీఠ ప్రాంగణంలో చేపట్టారు. విద్య, వాపార వృద్ధి కోసం మేధా దక్షిణామూర్తి హోమం నిర్వహించారు. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్లు తమ కరకమలములతో యజ్ఞ యాగాదుల్లో పాల్గొనే పండితులకు దీక్షా వస్త్రాలను అందజేసారు. వార్షికోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు.